మాస్ జాతర మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్..

మాస్ జాతర మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్..

రవితేజ, శ్రీలీల జంటగా  భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి మొదటి పాటను విడుదల చేయగా, తాజాగా రెండో పాటను రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన పాటకు భాస్కర్ యాదవ్ దాసరి లిరిక్స్ రాశాడు. భీమ్స్, రోహిని సోరట్ కలిసి పాడారు. 

‘ఓలే ఓలే..’ అంటూ సాగిన పాటలో రవితేజ, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.  జాతర బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లోని విజువల్స్ ఆకట్టుకున్నాయి.   ఇప్పటికే రిలీజ్ చేసిన  గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ సినిమాపై అంచనాలు పెంచింది. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై  నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న సినిమా విడుదల కానుంది.