V6 News

నాగబంధం మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ 

నాగబంధం మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ 

విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా  అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. ఈ మైథలాజికల్ అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీని కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘నమో రే’ సాంగ్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఆదివారం  సెకండ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇదొక వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్‌‌‌‌‌‌‌‌గా చూపిస్తూ..  సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా పాటను  రూపొందించారు. 

‘సుర సుర సుక్కలు తేరా సుట్టేద్దాం.. ఓయ్.. తర తర తోరణాలే కట్టేద్దాం.. ఓయ్.. గొర గొర గొర్రెలు తేరా కోసేద్దాం.. ఊరే నేసిందే జరీ అంచుల్లోనే ఓ సీరే.. సారే నీకంపిందే పొలిమేర అమ్మోరే.. నేల దిగివచ్చి ఆకాశం వేసే పందిళ్లే.. భూమి తన ఒడిలోనే పరిసిందే నీతల్లే.. చిటికెనేలు పట్టుకుంటే  నా లచ్చన బోనాలే.. ముత్యమంతా మోము మీద ముత్యాల తలంబ్రాలు..’ అంటూ ఫోక్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో  ఫెస్టివ్ సాంగ్‌‌‌‌‌‌‌‌గా సాగిన పాట ఆకట్టుకుంది.  

జునైద్ కుమార్, అభే  కంపోజ్ చేయగా,   గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ  మరింత జోష్‌‌‌‌‌‌‌‌ను  తీసుకొచ్చింది. కాసర్ల శ్యామ్ ఆకట్టుకునే సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ,  సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్  పాడటం స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. భారీ సెట్, గ్రాండ్ విజువల్స్‌‌‌‌‌‌‌‌, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌లతో ఈ పాట సినిమాకు  హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలవనుంది.  పాన్ ఇండియా స్థాయిలో  జులై 3న సినిమా  విడుదల కానుంది.