విజయ్ ఆంటోనీ తుఫాన్ మూవీ నుండి సెకండ్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

విజయ్ ఆంటోనీ తుఫాన్ మూవీ నుండి సెకండ్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

డిఫరెంట్ కాన్సెప్టులతో బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ‘తుఫాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో  కమల్ బోరా, డి లలితా, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘వెతికా నేనే నా జాడే’ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించగా, మాష్మి నేహా పాడారు. హరి దఫూషియా సంగీతాన్ని అందించారు. ‘వెతికా నేనే నా జాడే నిలిచి దారిలో.. నా ఒళ్లే వెతికే నేడు కొత్త పేరునే, నాకు నేనై తప్పిపోయా గాలై సాగుతూ..కాలం కరిగిపోయే తీరం చేరుతూ’ అంటూ ఆలోచింపజేసే లిరిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సాగిందీ పాట. 

ఈ సాంగ్  సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రంలో శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.