మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ భయం

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ భయం

ముంబై: కరోనా వైరస్‌‌తో యుద్ధం ముగియలేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కరోనాపై వార్ ప్రపంచ యుద్ధంతో సమానమని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే మాస్క్ తప్పనిసరిగా కట్టుకోవాలని సూచించారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంపై ఠాక్రే స్పందించారు. ‘మేం ప్రతి విషయాన్ని బహిరంగంగానే చెప్పాలనుకుంటున్నాం. కరోనా కేసులు ఎక్కువగా ఏం పెరగలేదు. గత రెండు వారాల నుంచే వీటి సంఖ్య ఎక్కువవుతోంది’ అని ఠాక్రే చెప్పారు. సెకండ్ వేవ్ వచ్చినట్లే అనిపిస్తోందన్నారు. కరోనా వ్యాప్తి తిరిగి పెరుగుతుండంతో మహరాష్ట్రలోని పలు జిల్లాల్లో ఠాక్రే లాక్‌‌డౌన్ విధించారు.