సర్వీస్ వదులుకున్నోళ్లకే మ్యూచువల్ ట్రాన్స్​ఫర్లు

సర్వీస్ వదులుకున్నోళ్లకే మ్యూచువల్ ట్రాన్స్​ఫర్లు
  • సర్వీస్ వదులుకున్నోళ్లకే మ్యూచువల్ ట్రాన్స్​ఫర్లు
  • ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి 
  • 2,558 మంది టీచర్లు, ఎంప్లాయీస్​కు లబ్ధి 
  • వెంటనే బడుల్లో రిపోర్టు చేయాలని ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు సర్వీస్ వదులుకున్న టీచర్లు, హెడ్మాస్టర్లు, ఎంప్లాయీస్​ మ్యూచువల్ బదిలీలకు సర్కారు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నెంబర్14ను రిలీజ్ చేశారు. సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు డీఈవోలకు మెయిల్ చేశారు. జీవో 317తో నష్టపోయిన టీచర్లకు మ్యూచువల్​బదిలీలకు సర్కారు అనుమతించింది. దీంతో 2,958 అప్లికేషన్లు వచ్చాయి. దీంట్లోనూ సర్వీస్ నిబంధన పెట్టడంతో 2,558 మంది తమ సర్వీస్​వదులుకునేందుకు అంగీకరిస్తూ ..1,279 మ్యూచువల్​అప్లికేషన్లు పెట్టుకున్నారు. వారందరిని బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2,558 మందికి లబ్ధి చేకూరినట్లయింది. ఇందులో జిల్లా స్థాయి బదిలీల్లో 2,538 మంది టీచర్లు, మల్లీజోన్ బదిలీల్లో 16 మంది హెడ్మాస్టర్లు, జోనల్ బదిలీల్లో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు మరో ఇద్దరు సూపరింటెండెంట్లున్నారు. మొత్తం బదిలీలు పొందిన వారిలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 484 మంది ఉండగా, మహబూబాబాద్​లో 248, జయశంకర్ భూపాలపల్లిలో 222, హన్మకొండలో 218, వరంగల్ 152,  కరీంనగర్ 142,  నిర్మల్104 , కామారెడ్డి104, మేడ్చల్196, సిద్దిపేట130, ములుగులో 112 మంది ఉన్నారు. కాగా టీచర్ల పరస్పర బదిలీలకు అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్​రెడ్డి, కమలాకర్​రావు కృతజ్ఞతలు చెప్పారు.