లక్ష మందితో బందోబస్తు.. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌‌‌‌

లక్ష మందితో బందోబస్తు.. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌‌‌‌
  •    రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతోపాటు ఇతర రాష్ట్రాల హోంగార్డులు కూడా..!
  •     సీసీటీవీ కెమెరాల నిఘాలో పోలింగ్ కేంద్రాలు
  •     కమాండ్‌‌‌‌ అండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ నుంచి మానిటరింగ్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 45 వేల మంది స్థానిక పోలీసులతో పాటు 375 కంపెనీలకు చెందిన దాదాపు 30 వేల మంది కేంద్ర బలగాలు, 23,500 మంది హోంగార్డులను మోహరించారు. దాదాపు లక్ష మంది బందోబస్తులో పాల్గొంటున్నారు. మావోస్టు ప్రభావిత ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీల్లోని పోలింగ్ స్టేషన్స్‌‌‌‌ వద్ద ఐదు అంచెల బందోబస్తు నిర్వహిస్తున్నారు. బుధవారం డీఆర్‌‌‌‌సీల నుంచి ఈవీఎంలను పోలింగ్‌‌‌‌ కేంద్రాలకు తరలించారు.ఈవీఎంలను జీయోట్యాగింగ్ చేశారు.

వార్​ రూమ్​ ద్వారా పర్యవేక్షణ

పోలింగ్‌‌‌‌ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను హైదరాబాద్​ బంజారాహిల్స్‌‌‌‌లోని కమాండ్ అండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్​– రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతోపాటు ఇతర రాష్ట్రాల హోంగార్డులు కూడా..! సీసీటీవీ కెమెరాల నిఘాలో పోలింగ్ కేంద్రాలు కమాండ్‌‌‌‌ అండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ నుంచి మానిటరింగ్​ టవర్​తో కనెక్ట్ చేశారు. దాదాపు 3,000కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌‌‌‌ను ఒకేసారి పర్యవేక్షించనున్నారు. కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లోని వార్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌ ద్వారా అన్ని డిపార్ట్‌‌‌‌మెంట్లకు ఒకేసారి సమాచారం చేరవేయనున్నారు. 

144 సెక్షన్‌‌‌‌కు విరుద్ధంగా గుమిగూడే వారిని గుర్తించి స్థానిక పోలీసులను అలర్ట్ చేయనున్నారు. స్థానిక పోలీసులతో పాటు కర్నాటక, ఏపీ, మహారాష్ట్ర నుంచి 5వేల మంది.. మధ్యప్రదేశ్‌‌‌‌, తమిళనాడు నుంచి 2వేల మంది.. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ నుంచి 2,500 మంది సహా మొత్తంగా 23,500 మంది హోంగార్డులను బందోబస్తులో వినియోగిస్తున్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌‌‌‌

పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదని ప్రజల్లో ఇప్పటికే అవగాహన కలిగించారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఓ అనుమతి పొందిన ఏజెంట్స్‌‌‌‌, ఓటు వేసేందుకు వచ్చే వారు మినహా ఇతరులను పోలింగ్ స్టేషన్‌‌‌‌లోకి అనుమతించరు. ప్రతి పోలింగ్ స్టేషన్‌‌‌‌ వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాలు సహా గత పోలింగ్‌‌‌‌ సమయాల్లో గొడవలు చేసిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. 

ఈ క్రమంలోనే సోషల్‌‌‌‌ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే కామెంట్స్‌‌‌‌, మార్ఫింగ్‌‌‌‌ ఫొటోలు, మార్ఫింగ్​ వీడియోలను గుర్తించనున్నారు. సోషల్‌‌‌‌ మీడియా మానిటరింగ్‌‌‌‌ సెల్స్‌‌‌‌ ద్వారా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.