రైల్వే స్టేషన్ వద్ద చోరీలు.. దొంగ ఎవరంటే..

రైల్వే స్టేషన్ వద్ద చోరీలు.. దొంగ ఎవరంటే..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చోరీలు చేస్తున్నదెవరో తెలిసిపోయింది. పోలీసులకు సవాల్ విసిరిన ఈ చోరీల కేసును ఛేదించేందుకు పోలీసులు దాదాపు 300కుపైగా సీసీ ఫుటేజీలను పరిశీలించారు. చాలా లాఘవంగా.. ఎవరూ గుర్తుపట్టలేనంత రహస్యంగా చోరీలకు పాల్పడుతున్నది ఒక మహిళ అని గుర్తించిన పోలీసులు.. ఆమె గురించి ఆరా తీయగా పాత నేరస్తురాలేనని గుర్తించారు. వెంటనే గాలింపు ముమ్మరం చేసి నిందితురాలిని అరెస్ట్ చేశారు రైల్వే పోలీసులు.
ప్రయాణికుల బ్యాగుల నుంచి 53 తులాల బంగారం ఎత్తుకెళ్లింది  కూకట్ పల్లి ఆల్విన్ కాలనీకి చెందిన ఆరూరి ప్రియా అనే మహిళ అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సోదాలు చేసి  ఆమె దగ్గర నుంచి  53 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితురాలిపై మూడు పోలీస్ స్టేషన్లో దొంగతనాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. ప్రయాణికులు విలువైన ఆభరణాలతో జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు రైల్వే ఎస్పీ అనురాధ.

 

ఇవి కూడా చదవండి

పల్లె, పట్టణ ప్రగతి సదస్సును బహిష్కరించిన సర్పంచులు

ఢిల్లీ ప్రభుత్వంపై కేసీఆర్ ప్రశంసలు

డబ్బులు దాచుకునేందుకే పార్థసారథికి టికెట్