సికింద్రాబాద్ టు వేవ్ రాక్: ఆరు కొత్త బస్సులు

సికింద్రాబాద్ టు వేవ్ రాక్: ఆరు కొత్త బస్సులు

హైటెక్ సిటీలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గ్రేటర్ ఆర్టీసీ జోన్ అధికారులు సికింద్రాబాద్ టూ వేవ్ రాక్ కు ఆరు కొత్త బస్సులు నడిపిస్తున్నారు. 49/M/216W  నంబర్ తో కొత్త రూట్ ఏర్పాటు చేశారు. ఆరు మెట్రో లగ్జరీ, వొల్వో బస్సులు ఈ రూట్ లో తిరగనున్నాయి. సోమవారం కొత్త రూట్ ను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సులు వయా ప్యాట్నీ, ప్యారడైజ్, ప్రకాశ్ నగర్, బేగంపేట్, గ్రీన్ ల్యాండ్స్, పంజాగుట్ట, కేర్ హాస్పిటల్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, టోలీచౌక్, షేక్ పేట్, దర్గా, గచ్చిబౌలి, ఇన్ఫోసిస్, విప్రో సర్కిళ్ల మీదుగా వేవ్ రాక్ కు చేరుతాయి. సికింద్రాబాద్ నుంచి ఉదయం 7.30 గంటలకు సర్వీసు ప్రాంరభమవుతుంది. చివరి సర్వీసు రాత్రి 9 గంటలకు ఉంటుంది. రోజు 24 సర్వీసులు సికింద్రాబాద్ నుంచి వేవ్ రాక్ రూట్ లో ప్రయాణికులను చేరవేస్తాయి. అదే విధంగా వేవ్ రాక్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉదయం 8.57 నిమిషాలకు మొదటి సర్వీసు ప్రారంభమతుంది. రాత్రి 10.37 గంటలకు చివరి సర్వీసు ఉంటుంది. ఈ సర్వీసుల ద్వారా ఐటీ ఎంప్లాయీస్ తో పాటు ఇతర ప్రయాణికులకు మేలు జరుగుతుందని ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు చెప్పారు. ప్రయాణికుల డిమాండ్ ఉన్న చోట తర్వలోనే మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామన్నారు.