జూ పార్క్ ప్రారంభించి పది రోజులు కూడా కాలేదు..అధికారుల నిర్లక్ష్యానికి పార్క్ లోని వన్యప్రాణులు బలవుతున్నాయి. పార్కులో యథేచ్చగా వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నా.. పట్టించుకునే నాధుడే లేడు.కేరళలోని త్రిస్సూర్‌లో కొత్త గా ప్రారంభించిన జూలాజికల్పార్కులో వీధికుక్కుల దాడిలో పదుల సంఖ్యలు జింకలు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.. వివరాల్లోకి వెళితే..
కేరళలోని త్రిస్సూర్ లో కొత్త పుత్తూరు జులాజికల్ పార్క్ ను ప్రారంభించారు. ఈ పార్కు ఆసియాలో రెండవ అతిపెద్ద జూలాజికల్ పార్క్. మన దేశంలో మొదటి డిజైనర్ జూ గా పేరుంది. విద్యార్థులు, పర్యాటకులను ఆకర్షిస్తోంది. అలాంటి నేషనల్ పార్కులో భద్రతా లోపం స్పష్టం కనిపిస్తోంది.
ఈ పార్కును ప్రారంభించి నెలరోజులుగా కూడా గడవక ముందే భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయి. బయటినుంచి వచ్చిన కుక్కలు పార్కులో యథేచ్చగా తిరుగుతున్నాయి. వన్యప్రాణులపై దాడులు చేస్తున్నాయి. అంతేకాదు పర్యాటకులను కూడా బెంబేలెత్తిస్తున్నాయి. వీధికుక్కల దాడిలో పదిరోజుల్లో 10 జింకలు ప్రాణాలు కోల్పోవడం భద్రతా వైఫల్యం ఏ విధంగా స్పష్టమవుతోంది.
వైల్డ్ యానిమల్ అరుణ్ జకారియా నేతృత్వంలోని బృందం మంగళవారం(నవంబర్ 12) పార్కును పరిశీలించింది. పోస్టు మార్టమ్ పూర్తయ్యాయి జింకల మరణంపై ఖచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు.
ప్రారంభించి 15 రోజులే..
కేరళలోని త్రిస్సూర్ లో కొత్త పుత్తూరు జులాజికల్ పార్క్ ను కేరళసీఎం విజన్ అక్టోబర్ 28న ప్రారంభించారు. ఈ పార్కు 336 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పార్కు లో మొత్తం 80 జాతుల 534 జంతువులను ఉంచారు. వీటిలో 23 జంతువులను బహిరంగ, సహజమైన ఎన్‌క్లోజర్లలో ఉంచారు. ప్రస్తుతం ఉన్న త్రిస్సూర్ జూ నుండి జంతువులను దశలవారీగా కొత్త క్యాంపస్‌కు తరలిస్తున్నారు.
అయితే ఇంత పెద్ద పార్కులో సెక్యూరిటీ లోపంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. పది రోజుల్లో 10 జింకలు చనిపోతే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు తలెత్తున్నాయి. సెక్యూరిటీ లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ, జంతు ప్రేమికులు కోరుతున్నారు.
