నడిరోడ్డుపై యువతికి ముద్దు.. సెక్యూరిటీ గార్డు అరెస్ట్

నడిరోడ్డుపై యువతికి ముద్దు.. సెక్యూరిటీ గార్డు అరెస్ట్
  • హైదరాబాద్ ​ఐటీ కారిడార్లో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: రాష్ట్ర రాజధానిలో నడిరోడ్డుపై ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఐటీ కారిడార్​లో ఓ సెక్యూరిటీ గార్డు అందరూ చూస్తుండగానే యువతికి ముద్దుపెట్టి పరారయ్యాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వైజాగ్‌‌కు చెందిన యువతి(24) హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌‌ హాస్టల్‌‌లో నివాసముంటూ సాఫ్ట్‌‌వేర్‌‌ ఉద్యోగం చేస్తోంది. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో యువతి ఆఫీస్‌‌కు వెళ్లేందుకు క్యాబ్‌‌ ఎక్కుతుండగా వెనుక నుంచి ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు.

ఒక్కసారిగా ఆమెను పక్కకు లాగి, అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ముద్దు పెట్టాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం స్థానికుల సాయంతో బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని జార్ఖండ్‌‌కు చెందిన రాజ్‌‌కుమార్‌‌ నగరానికి వచ్చి ఇందిరానగర్‌‌లోని సంతోష్‌‌ దాబాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతడిని అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించారు.