సెక్యూరిటీ గార్డ్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ఆఫీసు సిబ్బంది

సెక్యూరిటీ గార్డ్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ఆఫీసు సిబ్బంది

ప్రస్తుత జనరేషన్ లో డబ్బు అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన అంశంగా మారింది. జీవితంలో ఏది కావాలన్నా, ఏది కొనాలన్నా డబ్బే కావాలి. ఈ డబ్బు కోసమే ప్రజలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. దీని కోసమే చాలా మంది తమ ఇళ్లు వదిలి దూరప్రాంతాలకు పనికి వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో దేశం వెలుపలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి దూరంగా ఉండాల్సి రావడం సహజం.

ఓ సెక్యూరిటీ గార్డు ఎనిమిదేళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్లుగా తన ఇంటికి వెళ్లలేకపోయాడు. ఇంటికి డబ్బు పంపుతూ.. ఏ పండుగైనా, పుట్టిన రోజయినా ఒంటరిగానే జీవించేవాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత ఈసారి అకస్మాత్తుగా తన బర్త్‌డే సందర్భంగా ఆఫీసువాళ్లు కేక్ కట్ చేయడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు. దీంతో అతను కళ్ళ నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మలేషియాలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తోన్న సెక్యూరిటీ గార్డును ప్రజలు అభినందించారు. ఆఫీసు గేటు దగ్గర సందర్శకులను కంటికి రెప్పలా చూసుకున్న గార్డుని ముందుగా లోపలికి పిలిచారు. ఆ తర్వాత అక్కడ తన కోసం కేక్ ఆర్డర్ చేయడం చూసి భావోద్వేగానికి గురయ్యాడు. గత ఎనిమిదేళ్లుగా మలేషియాలో నివసిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పుట్టినరోజు నాడు తన ప్రియమైన వారిని గుర్తు చేసుకుంటూ ఒంటరిగా ఏడ్చేవాడే గానీ... అతను తన పుట్టినరోజును ఎప్పుడూ జరుపుకోలేదు. అయితే ఈసారి ఆఫీసు సిబ్బంది కారణంగా ఆయన పుట్టినరోజు జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ ఆఫీస్ సిబ్బందిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.