అయోధ్య సంబురం.. కట్టుదిట్టమైన భద్రత

అయోధ్య సంబురం.. కట్టుదిట్టమైన భద్రత

22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకల సందర్భంగా అయోధ్యలో  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.12 వేల మంది పోలీసులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సిటీ మొత్తం10 వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్క రామమందిరం ఆవరణలోనే 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఎల్లో జోన్​లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ కోసం ఏఐ ఉపయోగిస్తున్నారు. హైలెవెల్ సైబర్ ఎక్స్ పర్ట్ టీమ్ కూడా అయోధ్యకు చేరుకుంది.

మాంసం దుకాణాలు బంద్‌‌

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకలను పురస్కరించుకుని 22న ఢిల్లీలో మాంసం, చేపలు విక్రయించే వ్యాపారులందరూ తమ దుకాణాలను మూసివేయాలని ఢిల్లీ మీట్ మర్చంట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకల నేప‌‌థ్యంలో హిందూ సోదర, సోదరీమణుల మ‌‌నోభావాల‌‌ను గౌరవిస్తూ  మీట్‌‌, ఫిష్  విక్రయ కేంద్రాలను మూసివేయ‌‌డంతో పాటు వ‌‌ధ‌‌శాల‌‌ల‌‌ను కూడా ఆ రోజంతా  క్లోజ్ చేయాలని వ్యాపారులను కోరినట్లు అసోసియేషన్  జనరల్ సెక్రటరీ ఇర్షాద్ ఖురేషీ వివరించారు.

జమ్మూలో ఉత్సవాలు స్టార్ట్

శ్రీనగర్: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకలను పురస్కరించుకుని జమ్మూలోని రఘునాథ్ ఆలయంలో శుక్రవారం మహా ఉత్సవాలు మొదలయ్యాయి. మూడు రోజుల పాటు రఘునాథ్ ఆలయంలో రామాయణ పారాయణం, నృత్యం, సంగీతం, భజనలతో గ్రాండ్ ఫంక్షన్‌‌ను ప్లాన్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన కీర్తనలు, నృత్య కార్యక్రమాలుభక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఉత్తర భారతదేశంలోని అతి పెద్ద పురాతన ఆలయాల్లో రఘునాథ్ ఆలయం  ఒకటి.