జీహెచ్ఎంసీ ఎన్నికలకు భారీ బందోబస్తు

జీహెచ్ఎంసీ ఎన్నికలకు భారీ బందోబస్తు
  •  తనిఖీల కోసం స్పెషల్  స్ట్రైకింగ్ టీమ్స్‌‌
  •  సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్

హైదరాబాద్, వెలుగుజీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీస్‌‌‌‌‌‌‌‌ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా గైడ్ లైన్స్ ను పాటిస్తూ సెక్యూరిటీని సిద్ధం చేశారు. మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో 35, 000 మంది పోలీసులను సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నారు.  హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌‌‌‌‌‌‌‌ కమిషనర్ల పరిధిలో జాయింట్‌‌‌‌‌‌‌‌ సీపీలు,అడిషనల్‌‌‌‌‌‌‌‌ డీసీపీ స్థాయి అధికారులతో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేశారు. నామినేషన్లకు రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యాలయాల వద్ద ఎస్సై స్థాయి అధికారితో భద్రత కల్పించారు.

జోన్లవారీగా సెక్యూరిటీ

జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లు,6 జోన్లు, 30 సర్కిళ్ళలో దాదాపు 8 వేల పోలింగ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయనున్నారు. మోడల్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కండక్ట్‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా అమలు చేసేలా స్థానిక పోలీసులను అలెర్ట్ చేశారు. సిటీ కమిషనరేట్ పరిధిలోని 84, సైబరాబాద్‌‌‌‌‌‌‌‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 66 డివిజన్లలో టైట్ సెక్యూరిటీ పెట్టారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ సర్కిళ్లలో స్టాటిక్‌‌‌‌‌‌‌‌ సర్వైలెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌, ఫ్లయింగ్‌‌‌‌‌‌‌‌ స్వ్కాడ్‌‌‌‌‌‌‌‌లు, చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు, పోలీస్‌‌‌‌‌‌‌‌ పికెట్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు.  అభ్యర్థుల ప్రచారం, పోలింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు నోడల్ అధికారులు తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రీకాషన్స్‌‌‌‌‌‌‌‌ను రెడీ చేస్తున్నారు.

రౌడీషీటర్ల బైండోవర్..

అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా రౌడీషీటర్లను బైండోవర్ చేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌అధికారులతో కలిసి సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. పోలింగ్‌‌‌‌‌‌‌‌, కౌంటింగ్‌‌‌‌‌‌‌‌ తరువాత రిజల్ట్‌‌‌‌‌‌‌‌ వచ్చేంత వరకు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పీఎస్ పరిధిలోని లైసెన్డ్‌‌‌‌‌‌‌‌ ఆయుధాలను స్థానిక డీసీపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బ్లూ కోల్ట్స్‌‌‌‌‌‌‌‌, పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌తో గస్తీ నిర్వహించనున్నారు. ప్రచారాల్లో బాడీ వార్న్ కెమెరాలతో పాటు డిజిటల్ కెమెరాలతో వీడియో రికార్డింగ్ చేయనున్నారు. బుధవారం నామినేషన్​ సెంటర్లను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్​పరిశీలించారు. మోడల్​ కోడ్​ ఆఫ్​ కండక్టను పటిష్టంగా అమలు చేస్తామన్నారు.