డౌన్ డౌన్ పాకిస్తాన్.. జిందాబాద్ హిందుస్తాన్ : సీమా హైద‌ర్ డాన్స్

డౌన్ డౌన్ పాకిస్తాన్.. జిందాబాద్ హిందుస్తాన్ :  సీమా హైద‌ర్ డాన్స్

పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన  వివాహిత సీమా హైదర్ తన భర్త  సచిన్ మీనాతో కలిసి నోయిడాలో 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంలో పాల్గొంది.  అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ..  డౌన్ డౌన్ పాకిస్తాన్.. జిందాబాద్ హిందుస్తాన్ అంటూ ఉద్వేగభరితంగా  నినాదాలు చేసింది. త్రివర్ణ చీర కట్టుకుని భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేసింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీల పేర్లు పలకరిస్తూ జై అంటూ నినాదాలు చేసింది.   ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ మీనా (22)తో తరచూ ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడిన సీమా హైదర్.. అతనితో ప్రేమలో పడింది. తన నలుగురు పిల్లలను తీసుకుని ఇండియాకు వచ్చేసింది. ఈ క్రమంలో అక్రమంగా దేశంలోకి వచ్చినందుకు సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్ ను జూలై 4న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వాళ్లిద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది.   ఇండియా వచ్చిన సీమా హైదర్ ఇప్పుడు తన పేరును సీమా ఠాకూర్ గా మార్చుకుంది.  తాను హిందూ మతంలోకి మారానని, వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం కూడా మానేసింది.  

తాజాగా సీమా హైదర్  భారత పౌరసత్వం కోరుతూ క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసింది. తనను పాకిస్థాన్‌కు రప్పిస్తే అక్కడ తన రెండు చేతులు, కాళ్లు నరికి చంపేస్తానని పిటిషన్ లో పేర్కొంది. సీమా తన నలుగురు పిల్లలకు హిందూ పేర్లతో పేర్లు పెట్టింది. సచిన్‌తో కలిసి జీవించి చనిపోతానని చేప్తోంది. సీమా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినప్పటికీ ఆమె  పాక్ గూఢచారి అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏటీఎస్‌తోపాటు పలు ఏజెన్సీలు కేసును విచారిస్తున్నాయి.