క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌ గా సీమంతం

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌ గా సీమంతం

వజ్ర యోగి, శ్రేయ భారతి ప్రధానపాత్రల్లో సుధాకర్ పాణి తెరకెక్కిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘సీమంతం’. టీఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై  ప్రశాంత్ టాటా నిర్మిస్తున్నారు. శుక్రవారం దర్శకుడు తేజ చేతులమీదుగా ఈ మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేయించారు. 

గర్భిణీ మహిళలపై హత్యల నేపథ్యంలో సాగిన ఈ టీజర్‌‌‌‌ ఆసక్తికరంగా ఉందని.. విజువల్స్‌‌, బ్యాగ్రౌండ్‌‌ మ్యూజిక్‌‌తో పాటు థిల్లింగ్ ఎలిమెంట్స్‌‌ బాగున్నాయంటూ టీమ్‌‌కు తేజ బెస్ట్ విషెస్ చెప్పారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.  ఎస్. సుహాస్  సంగీతం అందిస్తున్నాడు.