కమ్యూనిస్టుల రాజ్యం వస్తదని భూస్వాములు భయపడ్డరు

కమ్యూనిస్టుల రాజ్యం వస్తదని భూస్వాములు భయపడ్డరు

తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే గతంలో కేంద్ర ప్రభుత్వం భూ సంస్కరణలను తీసుకొచ్చిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ  జరపడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.  తెలంగాణ విమోచన ఉద్యమ లక్ష్యాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని తెలిపారు. తెలంగాణ విమోచనం తర్వాత కమ్యూనిస్టు ల రాజ్యం ఎక్కడ వస్తుందోనని అప్పట్లో భూస్వాములు భయపడ్డారని చెప్పారు.

విమోచనం జరిగినప్పుడు RSS నాయకులు అందరూ జైల్లో ఉన్నారని సీతారాం ఏచూరి తెలిపారు. ఇప్పుడు ఓట్ల కోసం..  మేము పోరాటం చేశామని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మత కల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా సీబీఐ, ఈడీలను పెట్టి అధికారంలోకి రావడానికి బీజేపీ  ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. గోవా, మహారాష్ట్రలలో బీజేపీయేతర ప్రభుత్వాల కూల్చివేతే అందుకు నిదర్శమని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో లౌకిక శక్తులను ఏకం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీతారాం ఏచూరి తెలిపారు.