- రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి
గద్వాల, వెలుగు: నైతిక విలువలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించి పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి సూచించారు. బుధవారం అలంపూర్ కేజీబీవీ, గద్వాలలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ను ఆమె సందర్శించారు. స్టూడెంట్లతో మాట్లాడి సౌలతులపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పిల్లలతో పాఠాలు చదివించి, వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుతోనే అభివృద్ధి ఆధారపడి ఉంటుందని, ప్రతి ఒక్కరూ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. టీచర్లు సృజనాత్మకంగా బోధించాలన్నారు. కమిటీ సభ్యులు అపర్ణ, ప్రేమలత, అగర్వాల్ వందన, చందన, వచ్ఛన్ కుమార్, అడిషనల్ కలెక్టర్ నర్సింగారావు, డీడబ్ల్యూవో సునంద, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పవన్, తదితరులు పాల్గొన్నారు.
