ప్రజల సపోర్ట్​ లేకుండా భూసేకరణ ఎట్ల చేస్తరు?

ప్రజల సపోర్ట్​ లేకుండా భూసేకరణ ఎట్ల చేస్తరు?
  • అభివృద్ధి పేరుతో సర్కార్​ దగా 
  • సీతమ్మసాగర్​ భూ నిర్వాసితుల రాస్తారోకో

భద్రాచలం, వెలుగు: ప్రజల సపోర్ట్​ లేకుండా సీతమ్మ సాగర్​ బ్యారేజీ నిర్మాణానికి  రెండో విడత భూసేకరణ చేయడమేంటని రైతు సంఘాల ఐక్య పోరాట వేదిక, సీతమ్మసాగర్​ బ్యారేజీ భూనిర్వాసిత రైతులు ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామంలో శనివారం రాస్తారోకో చేశారు.

మిగులు భూములకు ప్రభుత్వం ఉచితంగా మోటర్లు ఇచ్చి సాగునీరు అందించాలని, ఎకరం భూమికి రూ.30లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.  పర్ణశాలలో నిలిచిన కరకట్ట పనులు ప్రారంభించాలని, వరదల బారి నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాల ప్రజలను కాపాడాలని కోరారు. కరకట్ట ప్రాజెక్టు డిజైన్​ను గ్రామసభల ద్వారా ప్రజలకు వివరించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్​ ఆఫీస్​లో వినతిపత్రం అందించారు.