గంజాయి పుష్పాలు : రూ.3 కోట్ల విలువైన.. 14 వందల కేజీల గంజాయి పట్టివేత

గంజాయి పుష్పాలు : రూ.3 కోట్ల విలువైన.. 14 వందల కేజీల గంజాయి పట్టివేత

చింతపల్లి: ఏపీలోని  అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ నిమ్మపాడు వద్ద మంగళవారం తెల్లవారుజామున పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా.. కారులో తరలిస్తున్న సుమారు రూ. 3కోట్ల విలువైన 14వందల కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు.  కారులో ఉన్న ఇద్దరు నిందితుల్లో ఒకరు పారిపోగా.. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కుడుముసారి పరిధిలోని నిమ్మపాడు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఓ కారుకు ఎస్కార్టుగా బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు వెనక వస్తున్న కారును ఆపేందుకు యత్నించారు. కారులోంచి ఓ వ్యక్తి దూకి పారిపోగా.. చింతపల్లి మండలం భీమసింగికి చెందిన డ్రైవర్  ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ఉన్న 1400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

Also Read : నిమజ్జనానికి రెడీ అయిన లక్ష గణేష్ విగ్రహాలు

డ్రైవర్ ప్రసాద్ ను విచారించగా.. ఒడిశాలోని దగుడుపల్లికి చెందిన కిలో సత్తిబాబు, మరికొందరు కలిసి అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా గంజాయిని మైదన ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలిపాడు.  డ్రైవర్ ప్రసాద్ తో పాటు రాళ్లగడ్డకు చెందిన సిందేరీ చిన్నయ్యను అరెస్ట్ చేసి వారి వద్ద లక్ష రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.