
మాస్ హీరోగా మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు నాని. ఓ వైపు ‘హాయ్ నాన్న’లాంటి ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే.. మరోవైపు దసరా, సరిపోదా శనివారం, హిట్ 3
చిత్రాలతో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ కంటెంట్‌తో రాబోతున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాని హీరోగా ఓ సినిమా రూపొందబోతోంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఇందులో నానికి జంటగా సాయిపల్లవి నటించబోతోందని వార్తలొస్తున్నాయి. శేఖర్ డైరెక్షన్‌లో ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు చేసింది సాయిపల్లవి.
అలాగే నాని, సాయిపల్లవి కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో మెప్పించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జంట కనువిందు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ‘కుబేర’ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ సినిమాలను హ్యాండిల్ చేయగలడని ప్రూవ్ చేసుకున్న శేఖర్ కమ్ముల.. నానితో ఎలాంటి సినిమా చేయబోతున్నాడా అనే ఆసక్తి నెలకొంది.