స్టేట్‌‌ లెవల్‌‌ రగ్బీ పోటీలకు నల్లబెల్లి స్టూడెంట్స్‌‌

స్టేట్‌‌ లెవల్‌‌ రగ్బీ పోటీలకు నల్లబెల్లి స్టూడెంట్స్‌‌

నల్లబెల్లి, వెలుగు : వరంగల్‌‌ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన శ్రీ విద్యానికేతన్​స్టూడెంట్స్‌‌ స్టేట్‌‌ లెవల్‌‌ రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 8న నర్సంపేట మండలం మాదన్నపేటలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీల్లో నల్లబెల్లి మండలం మామిండ్ల వీరయ్యపల్లికి చెందిన పెంతల అంజలి, నల్లబెల్లికి చెందిన కె.సమర్ధసాయి ప్రతిభ చూపారు.

వీరు 10, 11 తేదీల్లో హైదరాబాద్‌‌లో జరిగే స్టేట్‌‌ లెవల్‌‌ పోటీలకు హాజరుకానున్నారు. ఎంపికైన క్రీడాకారులను శ్రీ ఆదర్శ వాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ బుచ్చన్న, ప్రిన్సిపాల్ సుధాకర్, పీఈటీ దేవేందర్ పాల్గొన్నారు.