సినిమాలకు సెలవు పలికిన చంద్రమోహన్

V6 Velugu Posted on May 25, 2021

సీనియర్ నటుడు చంద్రమోహన్ తన పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాలలో నటించబోనని ఆయన తేల్చి చెప్పారు. మే 23న చంద్రమోహన్ పుట్టినరోజు. ఆ రోజు ఆయన తన 81వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘నేను 55 ఏళ్ళుగా సినిమాలలో నటిస్తున్నాను.  జూనియర్ ఎన్టీఆర్ ‘రాఖీ’ సినిమా షూటింగ్ సమయంలో గుండెనొప్పి రావడంతో బైపాస్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాధం’ షూటింగ్లో కూడా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డాను’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.

వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్, శ్రీమతి శారద ఆకునూరి సంయుక్త మరియు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు సంయుక్త ఆధ్వర్యంలో జూమ్ వీడియో ద్వారా ఈనెల 22 నుంచి రెండు రోజులపాటు చంద్రమోహన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. దాదాపు 14 దేశాల నుంచి 108 మంది రచయితలు పాల్గొని.. చంద్రమోహన్ నటించిన 108 సినిమాల గురించి, ఆయన నటనా వైదుష్యం గురించి విశ్లేషించారు.

Tagged Movies, tollywood, telugu movies, Chandramohan, senior actor chandramohan

Latest Videos

Subscribe Now

More News