శ్వాస ఇబ్బందితో ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటి

శ్వాస ఇబ్బందితో ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటి

పలు భాషలలో నటించి, మెప్పించిన సీనియర్ నటి జయంతికి శ్వాస తీసుకోవడంలో సమస్య రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమెకు మంగళవారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జయంతి గత కొంతకాలంగా ఆస్తమాతో భాదపడుతున్నట్లు ఆమె కుమారుడు కృష్ణ కుమార్ తెలియజేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో.. ఆమెకు కరోనా టెస్టు చేశారు. అయితే పరీక్షల్లో జయంతికి కరోనా నెగిటివ్ గా వచ్చింది.

జయంతి 2018లో కూడా శ్వాస సంబంధ జబ్బుతో ఆస్సత్రిలో చేరారు. ఆమె మార్చిలో తన కుటుంబంతో కలిసి హంపీ వెళ్లారు. అక్కడ వారంతా లాక్డౌన్ లో చిక్కుకుపోయారు. పోలీసుల అనుమతితో తిరిగి బెంగుళూరు చేరుకున్నారు. బెంగుళూరులో తన స్నేహితలతో కలిసి ఆనాటి మధుర చిత్రాలను చూస్తూ లాక్డౌన్ సమయాన్ని గడిపారు. జయంతి కన్నడ హీరో రాజ్ కుమార్ తో కలిసి దాదాపు 30కి పైగా సినిమాలలో నటించారు. అందుకే వారిద్దరిని హిట్ పెయిర్ అనే వాళ్లు. కన్నడ, మళయాళం, తమిళ్, మరాఠి, హిందీ మరియు తెలుగు భాషలన్నింటిలో కలిపి దాదాపు 500లకు పైబడి సినిమాలలో నటించారు. తెలుగులో పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ కు చెల్లెలిగా నటించారు.

For More News..

11 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న యువతి స్విమ్మింగ్ పూల్ వీడియో

సెల్ఫ్ ఐసోలేషన్ లోకి జార్ఖండ్ సీఎం