సీనియర్ నటి రాశి మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. రవి కుమార్ సీరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని రాశి పాత్రను పరిచయం చేసింది మూవీటీమ్. ఇందులో ‘సావిత్రి’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో ఆమె కనిపించనుందని రివీల్ చేశారు. సింపుల్ గెటప్‌లో కనిపించినప్పటికీ, ఆమె ముఖంలో కనిపించిన ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ పాత్ర ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
బ్యాగ్ చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథలో కీలక మలుపు తిప్పే పాత్రగా ఆమె కనిపించనున్నారని దర్శకుడు తెలియజేశాడు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ మోపురి సంగీతం అందిస్తుండగా, ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. శివ శర్వాని ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
