బీజేపీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ రాజేందర్

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ రాజేందర్

నిర్మల్, సారంగాపూర్ వెలుగు:  బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ బుధవారం బీఆర్​ఎస్​లో చేరారు. రాజేందర్​కు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సారంగాపూర్​మండలం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్​ఎస్​సీనియర్ నేత బాలకిష్టు రాజేందర్ తదితరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నిర్మల్​లో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఆమరణ నిరాహార దీక్ష అనంతరం మహేశ్వర్ రెడ్డి మొదటిసారిగా బహిరంగ ర్యాలీలో పాల్గొనడంతో ఆయనకు పార్టీ కార్యకర్తలు పూలదండలతో స్వాగతం పలికారు. బీఆర్ఎస్​లో కుటుంబ పాలన కొనసాగుతోందని, అవినీతి అక్రమాలు తారాస్థాయికి చేరుకున్నాయని నేతలు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. నిర్మల్ లో ఇంద్రకరణ్ ​రెడ్డికి ఓటమి ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామారావు పటేల్, పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జ్ రావుల రామనాథ్, పార్లమెంటు ఇన్​చార్జ్ భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.