
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ OG (Orginal Gangstar). సుజీత్(Sujeeth) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అభిమానులకి భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..సీనియర్ హీరో వెంకట్( Venkat) OG మూవీలో నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ OG మూవీకి సంబంధించిన కీలక విషయాలు తెలిపారు.తాను OG మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ అఫిషియల్ గా ఇంకా ప్రకటించలేదని అన్నారు.
అలాగే..తన క్యారెక్టర్ కు సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిపారు. ఇక తన రోల్ ఏంటనేది మాత్రం రివీల్ చేయలేనని..అందుకు డైరెక్టర్ సుజీత్ పర్మిషన్ అవసరమని తెలిపారు. హంగ్రీ చీతా మాస్ గ్లింప్స్తో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి.
ALSO READ :- IND vs ENG: ఆటగాళ్లకు కొత్త కష్టాలు.. పీకల మోతతో దద్దరిల్లుతున్న లక్నో స్టేడియం
ఓజీ సినిమా విషయానికి వస్తే..బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో చిత్రీకరణ తో బిజీగా ఉన్నారు డైరెక్టర్ సుజీత్. కొంతమేరకు పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వల్ల..షూటింగ్ కు కాస్తా ఇబ్బంది నెలకొనడంతో ఓజీ సినిమా విషయంలో డిలే అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ మూవీ అయిపోయాకే..మరో సినిమాను టచ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.