BJP Manifesto: 70ఏళ్ల లోపు వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్:ప్రధాని మోదీ

BJP Manifesto: 70ఏళ్ల లోపు వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్:ప్రధాని మోదీ

భారతీయ జనతాపార్టీ ఆదివారం(ఏప్రిల్ 14) లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది.తాము అధికారంలోకి వస్తే 70ఏళ్ల పైబడిన వృద్దులకు, లింగమార్పిడి వ్యక్తులకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కవరేజీని వర్తింపజేస్తామని ప్రధాని మోదీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు.

వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందన్నారు మోదీ. మహిళలు, పేదలు, యువత, రైతుల అభివృద్దే లక్ష్యంగా బీజేపీ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో తయారీకి సూచనలు ఇచ్చిన లక్షల మందికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్లను నిర్మాంచామన్న మోదీ.. మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని హామి ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందని తెలిపారు. 

బీజేపీ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపరిచింది. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భార్, గ్లోబల్ మాన్యుఫ్యాకర్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తత శిక్షణ, క్రీడా వికాసం,సంతులిక అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది బీజేపీ.