
అహ్మదాబాద్: ఆర్టీఐ యాక్ట్‌ను ఉపయోగించి.. అధికారులను ఇబ్బందులకు గురి చేసిన 9 మందిపై గుజరాత్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (జీఐసీ) లైఫ్ టైం బ్యాన్ విధించింది. వీరిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. తమకు కావాల్సిన సమాచారం కోసం వీరంతా మళ్లీ.. మళ్లీ ఆర్టీఐకు దరఖాస్తు చేసుకోవడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఇక వీరు ఎలాంటి సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న స్పందించొద్దని ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్లో ఇలా లైఫ్ టైం బ్యాన్ విధించడం తొలిసారి. ఈ 9 మంది.. ఆర్టీఐ యాక్ట్‌ను రిపీట్‌గా ఉపయోగిస్తూ వచ్చారని, అప్లికేషన్స్‌తో అధికారులను ఇబ్బంది పెట్టారని, తప్పుడు ఉద్దేశాలతో క్వశ్చన్ చేశారని, విసుగెత్తించారని కమిషన్ అధికారులు తెలిపారు.