సెన్సెక్స్​ 75 పాయింట్లు అప్​

సెన్సెక్స్​ 75 పాయింట్లు అప్​

ముంబై:  స్టాక్ మార్కెట్లు ఐదు సెషన్ల నష్టాల తరువాత శుక్రవారం స్వల్ప లాభాలను సంపాదించాయి. బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ సెన్సెక్స్ బ్యాంకింగ్, చమురు షేర్లలో వాల్యూ బయింగ్  ​కారణంగా 75 పాయింట్లు పెరిగి 73,961.31 వద్ద స్థిరపడింది. సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది గరిష్టంగా 74,478.89 పాయింట్లను  కనిష్టంగా 73,765.15 పాయింట్లను తాకింది. 50 షేర్ల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 42.05 పెరిగి 22,530.70 వద్ద ముగిసింది. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు అధిక ఒడిదుడుకుల మధ్య నిఫ్టీ,  సెన్సెక్స్ గురువారం నుంచి ఐదు రోజులలో 2 శాతానికి పైగా పడిపోయాయి.   

సెన్సెక్స్ ప్యాక్ నుంచి, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, ఐసీఐసీఐ బ్యాంక్ లాభపడ్డాయి. అయితే,   నెస్లే ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మారుతీ సుజుకీ ఇండియా, ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాక్సిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హిందుస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనిలీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనకబడ్డాయి.  ఆసియా మార్కెట్లలో షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్ మిశ్రమంగా ముగిశాయి. 

యూరోపియన్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రధాన సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి.  గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.40 శాతం తగ్గి బ్యారెల్ ధర 81.53 డాలర్లకు చేరుకుంది.  విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు) గురువారం రూ. 3,050.15 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.