ఫ్లాట్​గా ముగిసిన సూచీలు

ఫ్లాట్​గా ముగిసిన సూచీలు

ముంబై: అమెరికాలో రేట్ల పెంపుదల ఆందోళనల మధ్య ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవడంతో మంగళవారం బెంచ్‌‌‌‌మార్క్ స్టాక్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీ ఫ్లాట్‌‌‌‌గా ముగిశాయి.  సెన్సెక్స్​3.94 పాయింట్లు లాభపడి 65,220.03 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో, ఇది 146.82 పాయింట్లు పెరిగి 65,362.91 గరిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 2.85 పాయింట్లు పెరిగి 19,396.45 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌‌‌‌ ప్యాక్‌‌‌‌లో ఐటీసీ, మహీంద్రా అండ్‌‌‌‌ మహీంద్రా, విప్రో, లార్సెన్‌‌‌‌ అండ్‌‌‌‌ టూబ్రో, యాక్సిస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌, టాటా స్టీల్‌‌‌‌, మారుతీ, భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌లు లాభపడ్డాయి. 

అయితే, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌‌‌‌డిఎఫ్‌‌‌‌సి బ్యాంక్, టెక్ మహీంద్రా  అల్ట్రాటెక్ సిమెంట్ వెనుకబడి ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్  డీమెర్జ్​డ్​ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు వరుసగా రెండో సెషన్​లోనూ  లోయర్​ సర్క్యూట్​ను తాకాయి.  

బ్రాడ్​ మార్కెట్‌‌‌‌లో, బిఎస్‌‌‌‌ఇ మిడ్‌‌‌‌క్యాప్ గేజ్ 0.94 శాతం,  స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.89 శాతం పెరిగింది. సూచీలలో టెలికమ్యూనికేషన్ 2.10 శాతం, యుటిలిటీస్ 1.58 శాతం, పవర్ 1.44 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.25 శాతం, ఇండస్ట్రియల్స్ 1.16 శాతం, ఎఫ్‌‌‌‌ఎంసీజీ 0.70 శాతం పెరిగాయి. ఐటీ, బ్యాంకెక్స్‌‌‌‌ వెనుకబడ్డాయి.