సెన్సెక్స్ 645 పాయింట్లు డౌన్.. నిఫ్టీ 203 పాయింట్లు పతనం​

సెన్సెక్స్ 645 పాయింట్లు డౌన్.. నిఫ్టీ 203 పాయింట్లు పతనం​

ముంబై: యూఎస్​ బాండ్ల ​రాబడి పెరగడం, ఎఫ్​ఎంసీజీ, ఐటీ షేర్లలో నష్టాల కారణంగా బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్ గురువారం దాదాపు 645 పాయింట్లు పడింది. అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టీ 24,600 స్థాయికి దిగజారింది. సెన్సెక్స్ 0.79 శాతం నష్టపోయి 80,951.99 వద్ద స్థిరపడింది. ఇందులోని 27 షేర్లు నష్టపోయాయి.   ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 203.75 పాయింట్లు క్షీణించి 24,609.70 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ సంస్థలలో, మహీంద్రా అండ్​ మహీంద్రా, బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఐటీసీ, హిందుస్తాన్ యూనిలీవర్, రిలయన్స్,  మారుతి నష్టాలను చవిచూశాయి. ఇండస్‌‌‌‌‌‌‌‌ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్,  అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి.  బీఎస్​ఈ మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.33 శాతం క్షీణించగా, స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం పెరిగింది. బీఎస్​ఈలో 2,178 స్టాక్‌‌‌‌‌‌‌‌లు క్షీణించగా, 1,741 లాభాలతో ముగిశాయి.

ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్​ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్,  హాంకాంగ్  హాంగ్ సెంగ్ నష్టాల పాలయ్యాయి. యూరప్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. బుధవారం యూఎస్​ మార్కెట్లు బాగా క్షీణించాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 1.37 శాతం తగ్గి బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 64.02 డాలర్లకు చేరుకుంది.  

ఎఫ్​ఐఐలు బుధవారం రూ.2,201.79 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. మరోవైపు రీజిగ్‌లో భాగంగా సెన్సెక్స్ నుంచి నెస్లే, ఇండస్‌ఇండ్ బ్యాంక్ బయటకు వెళ్లాయి. ట్రెంట్‌, బెల్‌ వీటి ప్లేస్‌లోకి వచ్చాయి.