భారీ నష్టాల నుంచి తేరుకున్న మార్కెట్లు

భారీ నష్టాల నుంచి తేరుకున్న మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత ట్రేడింగ్ సెషన్లో భారీగా నష్టపోయిన మార్కెట్లు ఇవాళ లాభాల బాట పట్టాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో దేశీయ మార్కెట్లలో బుల్ పరుగులు పెట్టింది. గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో ఉండటం మార్కెట్కు కలిసొచ్చింది. ఉదయం 9:30గంటల సమయంలో సెన్సెక్స్ 1200లకుపైగా పాయింట్ల ప్రాఫిట్తో 55,740 వద్ద ట్రేడవుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 350పాయింట్లకుపైగా లాభంతో 16,603 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

మరిన్ని వార్తల కోసం..

ఇండోనేషియాలో భారీ భూకంపం

జీహెచ్ఎంసీ ఆఫీసర్లకు విజిలెన్స్ టెన్షన్