భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లో బుల్ పరుగులు పెట్టింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో భారీగా నష్టపోయిన మార్కెట్లు ఇవాళ తేరుకున్నాయి. కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలన్నీ లాభాల బాటలో పయనించాయి. ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపారు. రష్యా - ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలిగిపోతున్న సంకేతాలు మార్కెట్ కు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 3శాతంపైగా ప్రాఫిట్ గెయిన్ చేసింది. 

ఉదయం 56,731.56 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లో ఆరంభంలో నమోదైన 56,438.47 పాయింట్ల ఇవాళ్టి కనిష్ట స్థాయి. కొనుగోళ్ల మద్దదుతో 58,211.38 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 1736.21 పాయింట్ల ప్రాఫిట్ తో 58,142.05 వద్ద క్లోజయింది. బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, టైటాన్, విప్రో, ఏషియన్ పెయింట్స్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ  509.65 పాయింట్ల లాభంతో 17,352,45 వద్ద ముగిసింది. 

For more news..

తప్పుడు హామీలిచ్చి ప్రజల్ని మోసగించం

కేసీఆర్ బర్త్ డే రోజైనా నిరుద్యోగులను గుర్తు తెచ్చుకో