తప్పుడు హామీలిచ్చి ప్రజల్ని మోసగించం

తప్పుడు హామీలిచ్చి ప్రజల్ని మోసగించం

పటియాలా : పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని వేధిస్తున్న డ్రగ్స్ సమస్యను రూపుమాపుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇతర పార్టీల్లాగా తాము తప్పుడు హామీలిచ్చి, ప్రజల్ని మోసగించమని స్పష్టం చేశారు. తాను కేవలం నిజాలే మాట్లాడతానన్న రాహుల్.. అబద్దాలు వినాలనుకుంటే మాత్రం ప్రధాని మోడీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాటలు వినాలని అన్నారు. 

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్ పురాలో పర్యటించిన రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రయోగాలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. పంబాజ్ సంస్కృతిని తమ పార్టీ ఆకళింపు చేసుకుందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమనే ఆదరించాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ బర్త్ డే రోజైనా నిరుద్యోగులను గుర్తు తెచ్చుకో

సీఎం జగన్‌ను కలిసిన మంచు విష్ణు