నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ మార్కెట్లు

V6 Velugu Posted on Jan 21, 2022

స్టాక్ మార్కెట్లపై బేర్ పట్టు కొనసాగుతోంది. ఈ రోజు ప్రారంభం నుంచి మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లు వీక్ గా క్లోజవడం, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. కరోనాపై నెలకొన్న భయాలు కూడా నష్టాలు పెరిగేందుకు కారణమయ్యాయి. అమెరికాలో  నిరుద్యోగం 3నెలల గరిష్టానికి చేరడం, కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో యూఎస్ మార్కెట్లు కరెక్షన్కు గురవుతున్నాయి. మరోవైపు క్రూడాయిల్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్న అంచనాలు దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ ఉ. 10:30గం.ల సమయంలో 500 పాయింట్లకు పైగా నష్టంతో 58,960 వద్ద ట్రేడవుతోంది.  బజాజ్ ఫైనాన్స్, ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టైటన్, ఎస్బీఐ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం నష్టాల్లో కొనసాగుతోంది. 140 పాయింట్లకుపైగా లాస్ తో 17,600 వద్ద ట్రేడవుతోంది. 

ఇవి కూడా చదవండి..

ఢిల్లీ వాసులను వణికిస్తోన్న చలిగాలులు

మాది జన్మజన్మల బంధం.. మమ్మల్ని దేవుడే కలిపాడు

Tagged business, sensex, stock market, BSE, NSE, loss, share market

Latest Videos

Subscribe Now

More News