- 468 పాయింట్లు ఎగసిన నిఫ్టీ
ముంబై: బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం రిజర్వ్ బ్యాంకు నిర్ణయం తర్వాత రికార్డు గరిష్ట స్థాయిలలో స్థిరపడ్డాయి. ఆర్బీఐ జీడీపీ వృద్ధి అంచనాను 2024-–25కి మునుపటి 7 శాతం నుంచి 7.2 శాతానికి సవరించింది. దీంతో 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,720.8 పాయింట్లు జంప్ చేసి, డే ట్రేడ్‌లో 76,795.31 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. ఈ బెంచ్‌మార్క్ చివరికి 1,618.85 పాయింట్లు పెరిగి 76,693.36 వద్ద రికార్డు స్థాయిలో ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 498.8 పాయింట్లు పెరిగి 23,320.20 వద్దకు చేరుకుంది.
చివరికి ఈ ఇండెక్స్ 468.75 పాయింట్లు జంప్‌తో ఆల్ టైమ్ ముగింపు గరిష్ట స్థాయి 23,290.15 వద్ద స్థిరపడింది. ఆర్బీఐ వడ్డీరేట్లను మార్చకపోవడంతో ఐటీ, బ్యాంక్, రియల్టీ, ఆటో షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ, ఎనిమిదో పాలసీ సమావేశంలో రెపో రేటును 6.50 శాతం వద్ద మార్చకుండా ఉంచింది. సెన్సెక్స్ ప్యాక్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్‌లు అత్యధికంగా లాభపడ్డాయి. మొత్తం 30 సెన్సెక్స్ కంపెనీలు సానుకూలంగా ముగిశాయి.
బ్రాడ్మార్కెట్లో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 2.18 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.28 శాతం ర్యాలీ చేసింది. అన్ని సూచీలు పాజిటివ్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై లాభాలతో స్థిరపడగా, టోక్యో, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.04 శాతం పెరిగి 79.95 డాలర్లకు చేరుకుంది. ఎఫ్‌ఐఐలు గురువారం రూ. 6,867.72 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.
