ఇంకో ఏడాదిలో 82 వేలకు సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌

ఇంకో ఏడాదిలో 82 వేలకు సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌
  • అంచనా వేసిన మూడీస్‌‌‌‌

న్యూఢిల్లీ :  రానున్న ఏడాది కాలంలో బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్ 82 వేలకు చేరుకుంటుందని, ప్రస్తుత లెవెల్స్‌‌‌‌ నుంచి 14 శాతం పెరుగుతుందని  రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌‌‌‌డీఏ ప్రభుత్వం తన మెజార్టీ పాలసీలను కొనసాగిస్తుందని  పేర్కొంది. ఈ దశాబ్దం ఇండియాదని వెల్లడించింది. ‘ఎన్‌‌‌‌డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో పాలసీల కొనసాగింపు ఉంటుందని నమ్మొచ్చు. ఎకానమీ గ్రోత్‌‌‌‌పై, షేర్ల లాభాలపై దీని ప్రభావం ఉంటుంది. 

ఎకానమీ స్టెబిలిటీ నుంచి చిన్న పాలసీల వరకు అన్నింటిని ఎన్‌‌‌‌డీఏ కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నాం’ అని మూడీస్ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. రానున్న కాలంలో  వ్యవస్థలో కింది స్థాయి నుంచి  సంస్కరణలు ఉంటాయని  తెలిపింది.  స్టేబుల్ గవర్నమెంట్ ఉండడంతో ఇక మార్కెట్‌‌‌‌ ముందుకే పోతుందని, ఎమెర్జింగ్ మార్కెట్లలో ఇండియా గ్రోత్‌‌‌‌ ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 2024–25లో జీడీపీ గ్రోత్ రేట్ 6.8 శాతం ఉంటుందని మూడీస్ అంచనా వేసింది.