సెమీ ఫైనల్లో ఓడి.. రికార్డును చేజార్చుకున్న సెరెనా విలియమ్స్

సెమీ ఫైనల్లో ఓడి.. రికార్డును చేజార్చుకున్న సెరెనా విలియమ్స్

ఆరుసార్లు యూఎస్ ఓపెన్ ఛాంపియన్, అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ సెమీ-ఫైనల్స్‌లో బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజారెంకా చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగిన సెమీ-ఫైనల్స్‌లో అజరెంకా చేతిలో సెరెనా విలియమ్స్ 1-6, 6-3, 6-3 తేడాతో ఓడిపోయింది. దాంతో సొంత గడ్డపై రికార్డు స్థాయిలో ఈ ఏడాది 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని సెరెనా కోల్పోయింది. అజారెంకా ఫైనల్లో జపాన్ ప్లేయర్ నవోమి ఒసాకాతో శనివారం తలపడనుంది. అజారెంకా ఫైనల్‌కు చేరడం ఇది మూడవసారి. అజారెంకా గతంలో రెండుసార్లు 2012, 2013 సంవత్సరాలలో సెరెనా చేతిలోనే ఫైనల్స్‌లో ఓడిపోయింది.

ఆర్థర్ ఆషే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ ఓపెనింగ్ సెట్‌ను కేవలం అరగంటలోనే ముగించింది. గత ఏడు సంవత్సరాలలో మొదటిసారి గ్రాండ్‌స్లామ్ సెమీ-ఫైనల్ ఆడుతున్న అజారెంకా.. రెండవ సెట్‌లో చాకచక్యమైన షాట్‌లతో ఆధిక్యాన్ని సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ రెండుసార్లు గెలిచిన 38 ఏళ్ల సెరెనా.. ఎడమ చీలమండకు గాయంతో ఇబ్బంది పడుతోంది.

For More News..

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నేతల అరెస్ట్

రాష్ట్రంలో మరో 2,426 కరోనా కేసులు

దుబాయ్‌లో మనోడికి 7 కోట్ల జాక్ పాట్‌

రూంమేట్‌కి లొకేషన్ షేర్ చేసి.. సూసైడ్ చేసుకున్న లవర్స్