
తెలుగు సీరియల్స్.. ఈ మాట వింటే మగాళ్లకు మండిపోవచ్చు.. లేడీస్ కు మాత్రం హాయిగా ఉంటుంది. ఈవినింగ్ అయితే చాలు పోటీ పడి వచ్చే సీరియల్స్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అలా వస్తున్న ఒక సీరియల్ గుప్పెడంత మనసు(Guppedantha manasu). ఈ సీరియల్ కు చాల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇందులో జగతి(Jagathi) పాత్ర అంటే కూడా చాలా మంది ఇష్టపడతారు. ఈ పాత్ర కూడా చాల హుందాగా, సంప్రదాయ బద్దంగా ఉంటుంది. ఆపాత్రలో ఆడియన్స్ ను మెప్పించిన నటి పేరు జ్యోతి రాయి(Jyothi roi).
ప్రస్తుతం ఈ నటి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి కారణం ఇంస్టాగ్రామ్ లో ఆమె చేసే గ్లామర్ షో. అదేంటి గుప్పెడంత మనసు సీరియల్ లో హోమ్లీగా కనిపించే నటి.. గ్లామర్ షో చేయడం ఏంటా అని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రజెంట్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని రేంజ్ తన గ్లామర్ షో తో రెచ్చిపోతోంది ఈ 38 ఏళ్లు బ్యూటీ. దీంతో సోషల్ మీడియాలో ఈ భామ చేస్తున్న గ్లామర్ రచ్చ చూసి షాకవుతున్నారు గుప్పెడంత మనసు సీరియల్ లేడీ ఫ్యాన్స్. ట్రేడీ డ్రెస్సుల్లో ఆమెను చూసి ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.
ఇక జ్యోతి రాయి హాట్ హాట్ ఫొటోస్ చూసిన కుర్రకారు మాత్రం.. మీరు తల్లిగా చేయడం ఏంటి? హీరోయిన్ గా ట్రై చేస్తే బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా గుప్పెడంత మనసు సీరియల్ లో పద్దతిగా కనిపించిన జ్యోతి రాయి.. తన గ్లామర్ షో తో లేడీ ఫ్యాన్స్ కు షాకిచ్చింది.