
సీరియల్ నటి చైత్ర రాయ్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. అష్టాచెమ్మ సీరియల్ ద్వారా ఫుల్ ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ భారీ సెట్ లో శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తుండటం మరో విశేషం. దీనికి సంబంధించిన ఫోటోస్ కూడా ఈ మధ్య రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫోటోస్ కి ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీ నుండి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో సీరియల్ నటి చైత్ర రాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనుందట. అది కూడా సైఫ్ ఆలీ ఖాన్ కి భార్య పాత్రగా. ఈ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండనుందని సమాచారం. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్త గనక నిజం అయితే చైత్ర రాయ్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏ సినిమా తరువాత ఆమె వరుస ఆఫర్స్ కొట్టేయడం ఖాయం అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం, కొరటాల డైరెక్ట్ చేస్తుండటంతో.. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ తరువాత ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. యువసుధ, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.