రైతు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సెరికల్చర్ అధికారుల భేటీ..పట్టు పురుగుల సాగు సమస్యలపై చర్చ

రైతు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సెరికల్చర్ అధికారుల భేటీ..పట్టు పురుగుల సాగు సమస్యలపై చర్చ
  • ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చైర్మన్​ హామీ

హైదరాబాద్, వెలుగు: సెరికల్చర్​ రంగంలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని రైతు కమిషన్​హామీ ఇచ్చింది.  గురువారం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రైతు కమిషన్ కార్యాలయంలో  కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో సమావేశమై సెరికల్చర్ విభాగం ఎదుర్కొంటున్న సమస్యలను  కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.  గత పదేండ్లుగా  రాష్ట్రంలో సెరికల్చర్ విభాగం నిర్లక్ష్యానికి గురైందని అధికారులు వెల్లడించారు.

నియామకా లు లేకపోవడం, నిధుల కొరతతో నిర్వీర్యమైందని తెలిపారు. గత ప్రభుత్వంలో సెరికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హార్టికల్చర్ విభాగంలో విలీనం చేయడంతో మనుగడకే ప్రమాదం ఏర్పడిందని వివరించారు. జిల్లా స్థాయిలో అధికారుల కొరత తీవ్రంగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా కేవలం 60 మంది ఉద్యోగులు మాత్రమే సెరికల్చర్ విభాగంలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.పట్టుపురుగుల సాగులో రైతులకు మంచి లాభాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ, ఈ రంగాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

.పట్టుపురుగుల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. సెరికల్చర్ అధికారులు వివరించిన సమస్యలపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్ స్పందిస్తూ..సెరికల్చర్ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు దృష్టికి తీసుకెళ్తామన్నారు.