ప్రభుత్వ పథకాలే శ్రీరామ రక్ష: అరికెపూడి గాంధీ

ప్రభుత్వ పథకాలే శ్రీరామ రక్ష:  అరికెపూడి గాంధీ

మాదాపూర్, వెలుగు: రాష్ట్రంలో పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్​కు శ్రీరామ రక్ష అని ఆ పార్టీ శేరిలింగంపల్లి సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ తెలిపారు. శుక్రవారం మాదాపూర్​ డివిజన్​లోని చంద్రనాయక్​ తండా, సర్వే ఆఫ్​ ఇండియా, అయ్యప్పసొసైటీ, సాయినగర్​, మెగా హిల్స్, హరిజన బస్తీ, అరుణోదయ కాలనీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.