ప్రభుత్వ ఉద్యోగులను బీఆర్ఎస్ పట్టించుకోలే : జగదీశ్వర్ గౌడ్

ప్రభుత్వ ఉద్యోగులను   బీఆర్ఎస్ పట్టించుకోలే :  జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం హీనంగా చూసిందని.. వారి సమస్యలను పట్టించుకోలేదని శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం బొటానికల్ గార్డెన్​లో వాకర్స్​ను ఆయన కలిశారు. 

హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మహా నగరంలో పార్కుల ఏర్పాటు, శ్మశానవాటికలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. లక్షల ఎకరాల భూమిని అప్పటి  కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.