-arrested-two-people-who-were-selling-ganja-chocolates_xBpjyXL2QH.jpg)
చందానగర్, వెలుగు: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఇద్దరిని శేరిలింగంపల్లి ఎక్సైజ్, శంషాబాద్ డ్రగ్ టాస్క్ ఫోర్స్(డీటీఎఫ్) పోలీసులు అరెస్ట్ చేశారు. శేరిలింగంపల్లి ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్రశాంత్ కుమార్ (30), బిజయ్ గురు(30) సిటీకి వచ్చి మాదాపూర్ లోని చందానాయక్ తండాలో పాన్ షాప్ లు నడుపుతున్నారు.
వీరిద్దరు వారి షాపుల్లో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నారు. దీని గురించి సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి ఎక్సైజ్, శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు గురువారం పాన్ షాపులపై దాడులు చేశారు. ప్రశాంత్, బిజయ్ను అదుపులోకి తీసుకున్నారు. 7 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.