హైదరాబాద్ బేగంపేట్ లో రోడ్డు ప్రమాదం ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం (నవంబర్ 18) బేగంపేట్ బస్ స్టాప్ దగ్గర థార్ వాహనాన్ని, హెవీ లోడ్ కలిగిన ట్రక్ వెనుక నుండి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో థార్ వాహనం వెనుక భాగం నుజ్జు నుజ్జు అయింది.
బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర జరిగింది ఈ ప్రమాదం. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ట్రక్ అక్కడికక్కడే బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. థార్ వాహనంలో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది.
