ముషారఫ్ కు సీరియస్

ముషారఫ్ కు సీరియస్

దుబాయ్ ఆస్పత్రిలో చికిత్స

అమైలా యిడోసిస్‌‌‌‌‌‌‌‌ అనే అరుదైన వ్యాధి తో బాధపడుతున్న పాకిస్థా న్‌‌‌‌‌‌‌‌ మాజీ ప్రెసిడెంట్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ పరిస్థి తి సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఉంది. శనివారం రాత్రి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించటంతో దుబాయ్‌ లోని ఆసుప్రతిలో చేర్పించారని ఆల్‌ పాకిస్థా న్‌‌‌‌‌‌‌‌ ముస్లీం లీగ్‌ (ఏపీఎమ్‌ ఎల్‌ ) సెక్రటరీ జనరల్‌ మెహరిన్‌‌‌‌‌‌‌‌ ఆదామ్‌ మాలిక్‌ చెప్పా రు. అమైలా యిడోసిస్‌‌‌‌‌‌‌‌ అనేది అరుదుగా వచ్చే వ్యాధి . ముషారఫ్‌ చాలా రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. శరీరంలోని నరాలన్నీ బాగా దెబ్బతిన్నాయి.ఆయన నడవలేని, నిలబడలేని స్థితిలో ఉన్నారని డాన్‌‌‌‌‌‌‌‌ పత్రికకు మాలిక్‌ చెప్పా రు. ఈ వ్యాధి ఉన్నవారికి తరచూ హర్ట్‌‌‌‌‌‌‌‌ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది.1999 నుంచి 2008 వరకు ముషారఫ్‌ పాకిస్థా న్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2007లో రాజ్యాంగాన్నిరద్దు చేసినందుకు రాజద్రోహం కేసును ఎదుర్కొంటున్నారు. 2016లో చికిత్స కోసం దుబాయ్‌ వెళ్లిన ముషారఫ్‌ అక్కడే ఉంటున్నారు.