రాష్ట్రంలో 60 శాతం మందిలో యాంటీబాడీలు

రాష్ట్రంలో 60 శాతం మందిలో యాంటీబాడీలు

కరోనా యాంటీ బాడీలు ఎంతమందిలో ఉన్నాయో తెల్సుకునేందుకు... రాష్ట్రంలో ఇటీవల ICMR- NIN సంస్థలు కలిసి చేసిన సీరో సర్వే ఫలితాలు వచ్చాయి. సర్వే చేసిన ఏరియాల్లో సగటున 60% మందిలో యాంటీ బాడీలు గుర్తించినట్టు ప్రకటించారు. చిన్నారుల్లో 55%, పెద్ద వారిలో 61 % మందిలో యాంటీ బాడీలను గుర్తించారు. హెల్త్ కేర్ వర్కర్ లలో 82.4 % మందిలో కరోనా యాంటీ బాడీలున్నట్టు సర్వే తేల్చింది. 

ఇప్పటికే మూడు సార్లు రాష్ట్రంలో సీరో సర్వే జరిగింది. జూన్ లో నాలుగో విడత సర్వే చేశారు. జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేశారు. గతేడాది మొదటి సారి కేవలం 0.33%, రెండోసారి 12.5%, మూడోసారి 24.1 % మందిలో యాంటీ బాడీలను గుర్తించారు. ఆరు నెలల తర్వాత.. మొన్నటి జూన్ లో.. సెకండ్ వేవ్ ముగిశాక సర్వే జరిపారు. ఈ సర్వేలో.. 60.09శాతం మందికి యాంటీబాడీలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. జాతీయ స్థాయిలో డిసెంబర్ 2020 లో 24% మందిలో కోవిడ్ యాంటీ బాడీలను గుర్తించగా.. ఇపుడు అది 67% కి చేరింది. వ్యాక్సిన్ రెండు డోస్ లు తీసుకున్న వారిలో 94% మందిలో సీరో పాజిటివిటీ రేట్ గుర్తించినట్టు ప్రకటించింది.