జులైలో పిల్లలపై నోవావ్యాక్స్ క్లినికల్ ట్రయల్స్

జులైలో పిల్లలపై నోవావ్యాక్స్ క్లినికల్ ట్రయల్స్

కరోనా వైరస్ వ్యాప్తి నుంచి చిన్నారులను కాపాడే చర్యల్లో భాగంగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII) చర్యలకు సిద్ధమవుతోంది. నోవావ్యాక్స్ టీకాకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను జులై నుంచి ప్రారంభించాలని SII యోచిస్తోంది. అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన కోవావ్యాక్స్‌ను భారతదేశంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టాలని సీరమ్ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

కొవిడ్-19 వేరియంట్లను ఎదుర్కొనే సామర్ధ్యం 90.4 శాతం ఉందని సీరమ్ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న నోవావ్యాక్స్ ఇన్‌కార్పోరేషన్ తెలిపింది. కరోనా వేరియంట్లు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. వాటి నుంచి 100% రక్షణ కల్పించే సామర్ధ్యం ఎన్‌విక్స్-సిఓవి 2373 వ్యాక్సిన్ క్యాండిడేట్‌కు ఉందని చెప్పింది. తమ మూడవ దశ ట్రయల్‌ లో కొవిడ్-19ను ఎదుర్కొనే సామర్ధం 90.4 శాతాన్ని ఈ వ్యాక్సిన్ చూపిందని సీరమ్ సంస్థ తెలిపింది. ఇప్పటికే అమెరికా,మెక్సిలోని 119 ప్రదేశాలలో 29,960 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు చెప్పింది.