కొవొ‌వ్యాక్స్ ట్రయల్స్ షురూ.. సెప్టెంబర్‌లో అందుబాటులోకి..

కొవొ‌వ్యాక్స్ ట్రయల్స్ షురూ.. సెప్టెంబర్‌లో అందుబాటులోకి..

పూణె: సీరం ఇన్‌‌స్టిట్యూట్ రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ విజయవంతమైంది. మన దేశంతోపాటు ఇతర కంట్రీలకూ ఈ టీకాను సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ నుంచి రెండో వ్యాక్సిన్‌ను తీసుకురావాలని అనుకుంటున్నామని సీరం ఇన్‌‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల్లా తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొవొ‌వ్యాక్స్ పేరుతో కొత్త టీకాను తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్‌‌ను యూఎస్‌‌కు చెందిన నొవొవ్యాక్స్ అనే సంస్థతో కలసి రూపొందిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన ట్రయల్స్‌ను ఈ వారంలో భారత్‌‌లో మొదలుపెట్టామన్నారు. ఆఫ్రికాతోపాటు యూకే కొవిడ్ వేరియంట్స్‌పై కొవొవ్యాక్స్‌‌ను ప్రయోగించామని.. పరీక్షల్లో కొవొవ్యాక్స్ 89 శాతం ప్రభావవంతంగా పని చేసిందని వివరించారు.