నాలుగో క్వార్టర్లో జీడీపీ గ్రోత్​@  6.1%

నాలుగో క్వార్టర్లో జీడీపీ గ్రోత్​@  6.1%

న్యూఢిల్లీ: వ్యవసాయం, తయారీ, మైనింగ్,  నిర్మాణ రంగాల్లో మెరుగైన పనితీరు కారణంగా 2022–-23 జనవరి–-మార్చి క్వార్టర్​లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం వృద్ధి చెందింది. వార్షిక వృద్ధి రేటు 7.2 శాతం ఉంది. ఈ వృద్ధి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. దీనివల్ల రాబోయే కొన్ని సంవత్సరాలలో ఐదు ట్రిలియన్​ డాలర్ల లక్ష్యాన్ని సాధించడం సులువు అవుతుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. 2021–-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 9.1 శాతం పెరిగింది. 2023 మొదటి మూడు నెలల్లో చైనా 4.5 శాతం ఆర్థిక వృద్ధిని సాధించింది. 2023 మార్చి క్వార్టర్​లో జీడీపీ గ్రోత్​ 6.1 శాతంగా నమోదైంది. అక్టోబర్-–డిసెంబర్లో ఇది 4.5 శాతం,   2022 జులై-–సెప్టెంబర్లో 6.2 శాతంగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్​ఎస్​ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం, 2022 ఏప్రిల్–-జూన్ లో వృద్ధి 13.1 శాతం ఉంది. 2021–-22 జనవరి–-మార్చి క్వార్టర్​లో జీడీపీ నాలుగు శాతం పెరిగింది.  2021–-22లో 9.1 శాతంతో పోలిస్తే 2022–-23లో వాస్తవ జీడీపీ వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేశారు. 2022–-23 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం నామమాత్రపు జీడీపీ లేదా జీడీపీ వృద్ధి రేటు రూ. 234.71 లక్షల కోట్లు ( 2.8 ట్రిలియన్​ డాలర్ల) నుండి రూ. 272.41 లక్షల కోట్ల ( 3.3 ట్రిలియన్ డాలర్లకు) స్థాయికి చేరుకుంటుందని అంచనా.  2022–-23 క్యూ4లో స్థిరమైన  ధరల వద్ద జీడీపీ 6.1 శాతం వృద్ధి చెందింది. ఇది రూ. 41.12 లక్షల కోట్ల నుండి రూ. 43.62 లక్షల కోట్లకు పెరిగింది. 2022–-23 క్యూ4 లో ప్రస్తుత ధరల వద్ద జీడీపీని రూ. 71.82 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది  2021–-22 క్యూ4లో రూ. 65.05 లక్షల కోట్లు ఉండగా, ఈసారి 10.4 శాతం వృద్ధి చెందింది.  

ఏడు శాతం పెరిగిన జీవీఏ

2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో గ్రాస్​ వాల్యూ యాడెడ్​ (జీవీఏ) వృద్ధి 7 శాతంగా ఉంది, అంతకు ముందు సంవత్సరంలో 8.8 శాతం వృద్ధిని సాధించింది. తయారీ రంగంలో జీవీఏ వృద్ధి మార్చి 2023 క్వార్టర్​లో 0.6 శాతం నుండి 4.5 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో 2.3 శాతంగా ఉన్న మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీవీఏ వృద్ధి నాలుగో క్వార్టర్​లో 4.3 శాతంగా ఉంది. తాజా క్వార్టర్​లో కన్​స్ట్రక్షన్​సెక్టార్​ 10.4 శాతం పెరిగింది. 2021–-22  క్యూలో ఇది 4.9 శాతం పెరిగింది. వ్యవసాయ రంగం వృద్ధి 4.1 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగింది. నాలుగో క్వార్టర్​లో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా  ఇతర వినియోగ సేవల విభాగం 6.7 శాతం నుండి 6.9 శాతం పెరిగింది. సేవల రంగంలో జీవీఏ వృద్ధి (-- వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్,  ప్రసారాలకు సంబంధించిన సేవలు) 7.1 శాతం నుంచి 9.1 శాతానికి పెరిగింది. ఆర్థిక, రియల్ ఎస్టేట్  వృత్తిపరమైన సేవలు మార్చి 2023 క్వార్టర్​లో 7.1 శాతం వృద్ధి చెందాయి.  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్  ఇతర సేవలు క్వార్టర్​లో 3.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి. క్రితం సంవత్సరం ఇదే క్వార్టర్​లో ఇవి 5.2 శాతం వృద్ధిని సాధించాయి.

ఇండియా ఎంతో ఎదిగింది... మోర్గన్​ స్టాన్లీ రిపోర్ట్​

న్యూఢిల్లీ: ప్రధాని​ నరేంద్ర మోడీ నాయకత్వంలో గత పదేళ్లలో ఇండియా ఎంతో అభివృద్ధి సాధించిందని, ఆసియా, గ్లోబల్​ గ్రోత్​కూ ఊతమిచ్చిందని అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థ మోర్గన్​ స్టాన్లీ ప్రశంసించింది. ఇండియా గ్రోత్​పై విదేశీ ఇన్వెస్టర్లకు మొదట్లో చాలా అనుమానాలు ఉండేవని, అవన్నీ పటాపంచలు అయ్యాయని స్పష్టం చేసింది. ఇండియా తన సత్తాను వెలికితీయలేదన్న విమర్శలను కొట్టిపారేసింది. 2014 నుంచి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొంది. ఈ రిపోర్ట్​ ప్రకారం..2013 నాటి ఇండియాతో ఇప్పటి ఇండియా చాలా ముందుకు వెళ్లింది. ఇంత తక్కువ సమయంలోనే ఇండియా ఆర్థిక వ్యవస్థ ఎంతో పుంజుకుంది.  ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో రెండోస్థానంలో ఉంది.

కార్పొరేట్​ పన్ను తగ్గించడం, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై ఇన్వెస్ట్​మెంట్లు పెంచడం, జీఎస్టీని తేవడం, లబ్దిదారుల ఖాతాల్లోకే నేరుగా సబ్సిడీ మొత్తాన్ని జమచేయడం, ఇన్​సాల్వెన్సీ అండ్​ బ్యాంక్​ట్రప్ట్ కోడ్​ తేవడం, ఎఫ్​డీఐలపై ఫోకస్​ చేయడం, రియల్టీ కోసం కొత్త చట్టం తేవడం వంటి నిర్ణయాల వల్ల ఎంతో మేలు జరిగింది. మాన్యుఫాక్చరింగ్​, క్యాపిటల్​ స్పెండింగ్ ​భారీగా పెరుగుతున్నాయి. 2031 నాటికి ఎగుమతుల మార్కెట్ ​రెట్టింపై జీడీపీలో 4.5 శాతానికి చేరుతాయి. ఇన్​ఫ్లేషన్​, పెట్రో​ ధరలు తగ్గుతుండటంతో కన్సంప్షన్​ పెరుగుతోంది. వీటిన్నింటి వల్ల కార్పొరేట్లకు దండిగా లాభాలు వస్తున్నాయి. స్టాక్​ మార్కెట్ల ఇన్వెస్టర్లకూ మేలు జరుగుతోంది. ఇక నుంచి కూడా ఇండియాకు ఇన్వెస్ట్​మెంట్లు పెరుగుతాయి. గ్లోబల్​ క్యాపిటల్​ మార్కెట్​ ఫ్లోలపై ఇండియా ఆధారపడటం తగ్గింది కాబట్టి యూఎస్​ రెసిషన్​, ఆయిల్​ రేట్ల వంటివి పెద్దగా ప్రభావం చూపవు. ప్రస్తుతం ఇండియా తలసరి ఆదాయం 2,200 డాలర్లు ఉంది. 2032 నాటికి ఇది రెట్టింపై 5,200 డాలర్లకు చేరుకుంటుంది. దీనివల్ల డిస్క్రెషనరీ ప్రొడక్టుల అమ్మకాలు భారీగా పెరుగుతాయి.